ETV Bharat / state

NO Covid Cases: ఆ గిరిజన గ్రామాల్లో కరోనా లేదు.. కారణమేంటో తెలుసా? - విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ప్రవేశించని కరోనా

తొలిదశలో అత్యల్ప కేసులు నమోదైన విజయనగరం జిల్లా.. రెండో దశలో చిగురుటాకులా వణికిపోయింది. మొదటి దశలో 8 నెలల్లో 207 మంది మృతిచెందితే.. రెండో దశలో ఏప్రిల్‌, మే నెలలోనే 320 మంది దాకా బలయ్యారు. జిల్లావ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని గిరిజన గ్రామాల్లో కరోనా అడుగుపెట్టలేకపోయింది. స్వీయరక్షణ, క్రమశిక్షణే వారి విజయానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.

NO Covid Cases
క్రమశిక్షణతోనే కరోనాను జయించిన గిరిజన గ్రామాలు
author img

By

Published : Jun 1, 2021, 9:28 AM IST

క్రమశిక్షణతోనే కరోనాను జయించిన గిరిజన గ్రామాలు

విజయనగరం జిల్లాలో ఇప్పటివరకూ అధికారిక గణాంకాల ప్రకారం 77 వేల 795 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 వేల 665 మంది డిశ్చార్జి కాగా.. 6 వేల 615 మంది నేటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 527 మంది మృత్యువాతపడ్డారు. మిగిలినవాళ్లు హోంక్వారంటైన్‌ కోలుకున్నారు. మొదటిదశలో దాదాపు 8 నెలల్లో 207 మంది మృతిచెందగా.. రెండో దశలో ఏప్రిల్‌, మే నెలల్లో 320 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం.. శృంగవరపుకోట, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో కరోన ఉద్ధృతి కొనసాగింది.

నగరాలు, పట్టణాల్లో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురంలో అధికంగా వ్యాప్తి చెందింది. 8 మండలాల్లోని 143గ్రామాల్లో మాత్రం ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. వైరస్‌ జాడ లేని 143 గ్రామాల్లో.. చాలావరకూ గిరిజన ప్రాంతాలే ఉన్నాయి. మాస్క్‌ ధరించటం, భౌతికదూరం పాటించటం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటివి చేస్తూ.. కరోనాకు అడ్డుకట్ట వేశారు. బయట ప్రాంతాల నుంచి ఇతరులు గ్రామాల్లోకి రాకుండా రహదారులను నిర్బంధించారు. అవసరమైతే తప్ప వేరేవాళ్లెవరూ రాకుండా కట్టడి చేశారు. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించారు.

వ్యవసాయపనులనూ స్థానికులతోనే చేయించుకున్నారు. భవన నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. పల్లెల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులే అయినా.. వైద్యులు,వైద్యసిబ్బంది చెప్పిన జాగ్రత్తలు పాటించారు. ఇప్పటికీ సంప్రదాయ ఆహారపు అలవాట్లు పాటిస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థుల క్రమశిక్షణే వైరస్‌కు అడ్డుకట్టవేసిందని.. వైద్యాధికారులు చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే వ్యాప్తి నియంత్రణ సాధ్యమైందని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిని దరి చేరకుండా నియంత్రించటంతో పల్లెవాసుల విజయసూత్రాన్ని చుట్టుపక్కల గ్రామాలూ అనుసరిస్తున్నాయి.

ఇదీ చదవండి:

కృష్ణపట్నంలో పండగ వాతావరణం... ఔషధం పంపిణీకి చకచకా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.