ETV Bharat / state

వచ్చే నెలలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన! - గిరిజన విశ్వవిద్యాలయం

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ స్థలంపై ఉత్కంఠ వీడింది. సాలూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో ఈ విద్యా సంస్థను కొత్తవలస మండలం రెల్లి వద్ద ఏర్పాటు చేయాలని భావించారు. గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఉండాలన్న ప్రాతిపదికన తాజా మార్పు జరిగింది. వచ్చే నెలలో సీఎం జగన్ ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

వచ్చే నెలలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన!
author img

By

Published : Aug 30, 2019, 12:19 PM IST

వచ్చే నెలలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన!

రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ప్రకటించిన సంస్థల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి . ఈ వర్శిటీని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పన్నదొరపాలెం వద్ద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 500ఎకరాల భూమిని సైతం అధికారులు 2016లో సేకరించారు. భూసమస్యలు కొలిక్కి రావటంతో 2017లో విశ్వవిద్యాలయ ప్రహరీ గోడకు అప్పటి మంత్రి సుజయ కృష్ణ రంగారావు శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు కేంద్రం పార్లమెంటులో ఆమోదం పొందటమే ఇక తరువాయిగా అందరూ భావించారు. ఎన్డీఏ సర్కారు రెండో సారి అధికారం చేపట్టగానే... విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఈ పరిణామంతో రెల్లి వద్ద నిర్మాణ పనులు ప్రారంభమవుతుయని భావించారు.

అయితే.. గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఇటీవల దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విషయంపై కేంద్ర హోంమంత్రితోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ స్థలం కోసం రెవెన్యూ అధికారులు పాచిపెంట మండలం పెదకంచేరు పరిధిలోని భూములను పరిశీలించారు. సర్వేనంబరు-2లో 411.53 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. 200ఎకరాల్లో భవనాల నిర్మాణానికి వీలుగా ఉంది. గిరిజన రైతుల ఆక్రమణలో ఉన్న 111 ఎకరాలు స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించనున్నారు. 30ఎకరాల డి.పట్టాలకు కూడా ప్రత్యామ్నాయంగా భూమి కేటాయిస్తారు.

తాజాగా సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం జగన్‌... గిరిజన ప్రాంతమైన సాలూరు నియోజకవర్గంలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెదకంచేరు వద్ద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతున్న వారికి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారని.. ఆ సమయంలో గిరిజన వర్శిటీకి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.

Intro:నూతన టెక్నాలజీ ప్రవేశపెడుతున్నప్పటికీ అభివృద్ధి కావడం లేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం ఏడున్నర గంటలకు జగన్మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల లోని పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఆ సమయంలో ఈవీఎంల మొరాయించాయి సుమారు గంటకు పైగా ఆయన వేచి ఉన్నారు. ఓటింగ్ అనంతరం ఆయన ఈ టీవీ తో మాట్లాడుతూ గతంలో బ్యాలెట్ విధానం సరైనదని, ఈ నూతన ఈ విధానంతో ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

Body:t

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.