విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో గిరిజనులు లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయానికి వీలు లేకుండా పోయింది. పూట గడవక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గిరిపుత్రులు వాపోతున్నారు. అధికారులు తమకు నిత్యావసరాలు అందించాలని వేడుకుంటున్నారు. అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి..