ETV Bharat / state

Tiger wandering: ఆ ప్రాంతంలో చిరుతపులి సంచారం...భయాందోళనలో ప్రజలు

Tiger wandering: బిరసాడవలస, జయితి సమీపంలో చిరుతపులి సంచరిస్తోంది. సమీప గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు... ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

Tiger wandering
చిరుతపులి సంచారం
author img

By

Published : Apr 14, 2022, 5:04 PM IST

Tiger wandering: విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడవలస, జయితి సమీపంలో గత నాలుగు రోజులుగా చిరుతపులి సంచరిస్తున్నట్లు వాహన దారులు, సమీప గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. పులులు తిరుగుతున్నాయనే సమాచారంతో సమీపంలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు సైతం నిలిపివేశారు. పరిసర గ్రామాల్లో రాత్రివేళల్లో పలువురు వాహనదారులకు పులి కనిపించిందని చెబుతుండటంతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చిరుత సంచరించిన ఆనవాళ్లు పరిశీలించారు. వాటి అడుగుజాడల ఆధారంగా చిరుతపులిగా నిర్ధారించారు.

సమీపం అనంతసాగరం చెరువులో నీటి సదుపాయం ఉండటం, పరిసర ప్రాంతాల్లో కొండ ఉండటం వల్ల పులి సంచరించే అవకాశం ఉందని డీఎఫ్ఓ తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి పులి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించవద్దని, పొలాల్లో ఒంటరిగా ఉండొద్దని డీఎఫ్ఓ సూచించారు.

ఇదీ చదవండి: People fell ill at Nandyal: ఆళ్లగడ్డలో 40మందికి అస్వస్థత.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.