విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు గ్రామ వాలంటీర్ల నియామకంలో అన్యాయం జరిగిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పాచిపెంట మండలం పనుకువలస పంచాయతీ పెద్ద చీపురు వలస గ్రామానికి చెందిన గిరిజనులు ఈ విషయంపై... ఐటీడీఏ పీవో వినోద్ కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేని కారణంగా... రాత్రి వరకు వేచి ఉన్నారు.
పోస్టులకు ఏడుగురి దరఖాస్తు
పనుకువలస గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఏడుగురు అభ్యర్థులు వాలంటీర్ల పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఐదుగురికీ పోస్టులు రాలేదని అభ్యర్థులు వాపోయారు. కొంతమంది నాయకులు చేతివాటమే.. తమకు జరిగిన అన్యాయానికి కారణమని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.