విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గులివిదాడ అగ్రహారంలో ముగ్గురు మహిళలు చిట్టీల పేరుతో పలువురిని మోసం చేశారు. స్థానికంగా ఉండే డాలర్ భాగ్యలక్ష్మి, సంధ్య, రమ్య అనే మహిళలు తమ మాటలతో పరిసరాల్లో ఉండేవారిని నమ్మించి చిట్టీలు వేయించారు. 150 మంది గృహిణులు వారి వద్ద చిట్టీలు కట్టారు. కొద్ది రోజులకు సొమ్ము చెల్లించాలని బాధితులు అడగటంతో తమ దగ్గర లేవని చేతులు ఎత్తేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు రూ.2 కోట్ల వరకు మోసం చేసినట్లు బాధితులు తెలిపారు.
ఇదీ చదవండీ...అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం