ETV Bharat / state

విజయనగరం జిల్లాలో ప్రారంభమైన మూడో విడత పోలింగ్​ - Polling for the third phase of Panchayat elections in Vizianagaram district news

విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. పోలింగ్​ నిర్వహణకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

third phase of polling started
ప్రారంభమైన మూడో విడత పోలింగ్​
author img

By

Published : Feb 17, 2021, 9:54 AM IST

Updated : Feb 17, 2021, 11:41 AM IST

విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. విజయనగరం డివిజన్​లో మూడు నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో 248 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 207 స్థానాలలో 642 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విలీన వివాదాల కారణంగా గరివిడి, డెంకాడ మండలాల్లోని నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2,330 వార్డుల్లో 610 వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,720 వార్డుల్లో 5,239 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

పోలింగ్ నిర్వహణకు అధికారులు 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విడతలో 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. మూడో విడత ఎన్నికల గ్రామాల్లో 62 సమస్యాత్మక, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 82 రూట్ మొబైల్స్, 30 స్ట్రైకింగ్ ఫోర్స్, 30 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్​లతో పాటు.. దాదాపు 3 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటింగ్​లో పాల్గొంటున్నారు.

చీపురుపల్లి

నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పోలింగ్​ మొదలైంది. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎన్నికల అధికారి సల్మాన్ రాజ్ అన్నారు. పోలింగ్​ సమయంలో సహకరించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​ ప్రజలను కోరారు.

పోలింగ్​ శాతం

ఉదయం 8:30 గంటల సమయానికి 15.3 శాతం పోలింగ్ నమోదైంది. మెరకముడిదాంలో 11.8శాతం, చీపురుపల్లి- 13.3, గరివిడి- 12.4 శాతం, గుర్ల- 15.4, నెల్లిమర్ల- 24.1, పూసపాటిరేగ- 11.6, భోగాపురం- 24.4, డెంకాడ- 12.3, విజయనగరం- 15.7 శాతం.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: శ్రీకాకుళం జిల్లా అంపిలి సర్పంచ్‌ అభ్యర్థి గృహనిర్బంధం

Last Updated : Feb 17, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.