విజయనగరంలో ఈ నెల 23న జరిగి భారీ బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం జరిన రెండు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు 6.18 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ దీపిక తెలిపారు. ఈ సందర్భంగా దోపిడీకి సంబంధించి పూర్తివివరాలను ఎస్పీ వెల్లడించారు.
ఈ నెల 21న విజయనగరంలోని గంటస్తంభం వద్ద ఉన్న రవి జ్యువెలర్స్‌లో దోపిడీ జరిగింది. దుకాణం యజమాని రామ్మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అలాగే.. నగరంలోని పలుచోట్ల జనవరి, ఫిబ్రవరిలో నెలల్లో ఇదే తరహాలో చోరీలు జరగడంతో కేసు దర్యాప్తు కోసం మూడు బృందాలను నియమించాం. ప్రత్యేక బృందాల దర్యాప్తులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్‌ను ఈకేసులో నిందితుడిగా తేల్చారు.
అతన్ని అరెస్టు చేసి 6.18 కిలోల నగలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 90.52 గ్రాముల సిల్వరు బ్రాస్ లెట్లు, రూ.15 వేలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో శ్రీవాస్‌పై 11 కేసులన్నాయి. విజయనగరంలోనూ మరో 3 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిన అభినందించిన ఎస్పీ.. వారికి నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేశారు.