విజయనగరం జిల్లా కురుపాం మండలం నేరేడుమానులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు నేరేడుమానుకు చెందిన బిడ్డిక జ్యోతి(18)గా పోలీసులు గుర్తించారు. జ్యోతి స్నేహితురాలి పెళ్లికి శ్రీకాకుళం జిల్లా బిల్లుగూడ వెళ్లింది. అధిక రక్తస్రావం అవడంతో స్నేహితులు నీలకంఠపురంలోని ఆస్పత్రిలో చేర్పించారు. నీలకంఠపురం నుంచి భద్రగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా యువతి మృతిచెందింది. యువతి మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్