విజయనగరం జిల్లా భోగాపురం మండలం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుందర సామాజిక ఆసుపత్రిలో గత మూడేళ్ల క్రితం అంబులెన్స్ వాహనానికి చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చింది. అప్పటినుంచి మరమ్మతులు చేయకుండా అలానే వదిలేశారు. ఇప్పుడు ఈ వాహనం ఎందుకు పనికి రాకుండాపోయింది. ఇదే విషయం విజిలెన్స్ తనిఖీల్లోనూ బయటపడింది. ఇలా చేసినందుకుగాను సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక పథకాలు మూలనపడుతున్నాయని పలువురంటున్నారు.
ఇది చదవండి కరోనా ఎఫెక్ట్: రెండు విడతల్లో విద్యార్థులకు తరగతులు