విజయనగరం జిల్లా వ్యాప్తంగా.. ఆలయాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక అలంకరణలు, పూజలు, హెూమాలతో కళకళలాడాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని పైడితల్లి, కన్యకాపరమేశ్వరీ అష్టలక్ష్మి, శ్రీ వేంకటేశ్వరస్వామి, సరస్వతీ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైడితల్లి ఆలయాన్ని సైతం అందంగా అలకరించారు.
వివిధ రకాల పూల మొక్కలతో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ప్రధాన ద్వారంతోపాటు.. అంతరాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అమ్మవార్లను అలంకరించారు. పండుగవేళ స్వామివార్ల దీవెనలు పొందేందుకు భక్తులు బారులు తీరారు.
ఇదీ చదవండి: PIG FIGHT: కోళ్లు, ఎద్దులు, పొట్టేళ్లే కాదు.. బరిలో మేం కూడా