ETV Bharat / state

వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు: కిమిడి నాగార్జున

విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన జ్యోతిషుడు యజ్ఞపరపు అప్పలనాయుడు అలియాస్ భవాని ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. తెదేపా గెలుస్తుందని జోతిష్యం చెప్పినందుకు వైకాపా నాయకులు బెదిరించటంతో అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెదేపా పార్లమెంట్​ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు.

kimidi nagarjuna
భవానీ ప్రసాద్​ను పరామర్శిస్తున్న కిమిడి నాగార్జున
author img

By

Published : Feb 9, 2021, 6:52 PM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు యజ్ఞపరపు భవాని ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిగా తెదేపా అభ్యర్థి యలకల పద్మ గెలుస్తుందని భవానీ ప్రసాద్ జోతిష్యం చెప్పారు. దీంతో అతన్ని వైకాపా నాయకులు చంపేస్తామని బెదిరించారు. భయంతో.. భవానీ ప్రసాద్ పురుగుల మందు తాగి బలవర్మరణానికి యత్నించాడు.

జిల్లాలోని వెంకటరామ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో భవానీ ప్రసాద్ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. తెదేపా పార్లమెంటరీ అధ్యకుడు కిమిడి నాగార్జున.. భవానీ ప్రసాద్​ను పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు నాగార్జున ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెదేపా గెలుస్తుందని జోతిష్యం చెప్పటం కూడా తప్పేనా అని కిమిడి నాగార్జున ప్రశ్నించారు. తెదేపా గెలుస్తుందని చెప్పినందుకు భవానీ ప్రసాద్​ను గేదెల ఆదినారాయణ బెదిరించడం సరికాదని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదవులు శాశ్వతం కాదని, మనిషి ప్రాణం ముఖ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మండిపడ్డారు. భవాని ప్రసాద్​కు ఏమైనా జరిగిదే.. ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'అధికార పార్టీకి పోలీసులు దాసోహం.. ఈ కేసులే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.