విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కుడుమూరు గ్రామంలో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. వైకాపా నాయకులు చెప్పినట్లు.. అధికారులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 250 కుటుంబాల గిరిజనులకు భూమి పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గిరిజన భూములపై అక్రమార్కుల కన్ను పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గిరిజన మంత్రి, ఎమ్మెల్యే ఉన్నా.. ఇక్కడి గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. పోలీసలు బెదిరిస్తున్నారని.. గిరిజనులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: