విజయనగరం సిటీ బస్టాండ్ వద్ద ఉన్న సిద్ధి వినాయకుని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా నేత అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందర్నీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
అన్ని మతాలను గౌరవించాలి
వైకాపా ప్రభుత్వ తీరుపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఆంక్షలు అమలు చేస్తే అన్నింటికి వర్తింపజేయాలి కానీ.. కేవలం వినాయక చవితి వేడుకలకు కాదన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను గౌరవించాలన్నారు. కోర్టులే లేకపోతే.. తమను ఎప్పుడో జైల్లో వేసేవారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడాలన్నారు. వైకాపా నేతలు హిందూ ఆలయాల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. బెయిల్ పై బయటికి వచ్చిన వ్యక్తి వరహాలక్ష్మి దేవాలయానికి ఛైర్మన్గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి