విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడమైన మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయటం వల్ల ఆ ప్రదేశం అపవిత్రం అయ్యిందని... తెదేపా విజయనగరం నియోజక వర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. మూడు లాంతర్ల స్తంభం కూల్చివేసిన ప్రదేశాన్ని పవిత్రంగా కాపాడుకుంటామంటూ.. అదితి గజపతిరాజు, తెదేపా నాయకులు ఆ ప్రదేశంలో పాలాభిషేకం చేశారు.
వందల ఏళ్లక్రితం నిర్మించిన మూడు లాంతర్ల కట్టడం విజయనగరం చారిత్రక చిహ్నంగా ఉండేదని, ఆనాటి విజయనగరం వైభవానికి ఆనవాలుగా ఉండేదని తెలిపారు. ఈనాడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి, పదవులు అనుభవిస్తున్న నాయకులే చారిత్రక చిహ్నాల ధ్వంసానికి పాల్పడటం దారుణమన్నారు.
ఇదీ చదవండి: