డప్పు వాయిద్యాలతో.. ఆటపాటలతో ఎన్నికల ప్రచారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ జగదీశ్వరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. వారికి మహిళలు ఘనస్వాగతం పలికారు. డప్పుల వాయిద్యాలతో ప్రచారం జోరుగా సాగింది. మహిళలు, యవకులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు. అభ్యర్థి చిరంజీవులు వారితో ఆడుతూ మరింత ఉత్సాహపరిచారు. చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి.. తెదేపా జిందాబాద్ అని నినాదాలు చేస్తూ కార్యకర్తలు ముందుకు సాగారు.
ఇవీ చదవండి..
ఆమంచితో అన్నీ అనర్ధాలే- మళ్లీ అవకాశమివ్వొద్దు'