ETV Bharat / state

విజయనగరానికి విదేశీ అతిథులు - ఏపీలో సైబిరియాన్ పక్షులు న్యూస్

ఎక్కడో రష్యాలో సైబీరియన్ దీవుల్లో ఉండే కొంగలు ఆంధ్రప్రదేశ్​కు వచ్చి ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండదాడి గ్రామస్థులకు ఆనందాన్ని ఇస్తున్నాయి.

విజయనగరానికి విదేశీ అతిథులు
విజయనగరానికి విదేశీ అతిథులు
author img

By

Published : Jul 28, 2020, 10:57 PM IST

విజయనగరానికి విదేశీ అతిథులు

మనం గగనతలంలో గానీ సముద్రాల్లో గానీ ప్రయాణం చేయాలంటే.. దిక్సూచి ఆధారంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ కొంగలు ఒక్కసారి వచ్చి వెళ్తే గుర్తు పెట్టుకుంటాయి. అలా వచ్చి ఏటా విజయనగరం జిల్లా కొండదాడి గ్రామంలో ఆనందాన్ని పంచుతుంటాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటాయి.

సైబీరియన్ నుంచి.. వచ్చే కొంగలు.. మన ఆంధ్రప్రదేశ్​లో సుమారు ఎనిమిది.. కేంద్రాల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి దగ్గర తేలినీలాపురం, ఇచ్చాపురం దగ్గర తేలుకుంచి.. విశాఖ జిల్లాలో కొండకర్ల, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, కృష్ణా జిల్లాలో అటపాక.. నెల్లూరులో నేలపట్టు, అనంతపురంలో వీరాపురం, కర్నూలులో రాళ్లపాడు ఇవి.. ఎనిమిది సంరక్షణ కేంద్రాలు. ఇప్పుడు విజయనగరం జిల్లా కొండదాడి గ్రామంలో కూడా ఈ పక్షులు సుమారు మూడు వేల నుంచి 5000 వరకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.

తమ గ్రామానికి విదేశి అతిథులు రావడం ఆనందగా ఉందని.. కొండదాడి గ్రామస్థులు చెబుతున్నారు. ఈ పక్షులతో ఎటువంటి.. ఇబ్బందులు లేవని అంటున్నారు. పక్షులు రావడంతోనే వరినాట్లు వేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.