నాటు తుపాకి పేలుడులో గాయపడిన బాధితుడికి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ సమీపంలో నాటు తుపాకీ ఘటనలో గాయపడిన గౌరు అనే వ్యక్తిని తొలుత కురుపాం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన బాదితుడిని అక్కడి నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కానీ బాధితుడి కుటుంబీకులు మాత్రం పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ రామ్మోహన్ రావు శస్త్రచికిత్స చేసి తూటాను బయటికి తీశారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఘటనపై ఎల్విన్ పేట ఎస్ఐ నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: