ETV Bharat / state

విద్యుత్ షాక్​తో విద్యార్థి మృతి - ఈరోజు విజయనగరం జిల్లాలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి వార్తలు

విద్యుత్ షాక్​తో విద్యార్ధి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొరియా గ్రామమైన.. గంజాయిభద్రలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Student dies of electric shock
విద్యుత్ షాక్​తో విద్యార్థి మృతి
author img

By

Published : Mar 19, 2021, 10:04 AM IST

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న కొరియా వివాదస్పద గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయిభద్ర గ్రామానికి చెందిన గెమ్మేల రోభి (17) బొబ్బిలిలో ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల కిందట తల్లిదండ్రులు చూడడానికి ఇంటికి వచ్చాడు. ఈనెల 16న నేరెళ్ల వలస సంతకు వెళ్ళి వస్తుండగా.. మూత్ర విసర్జన చేస్తూ.. అక్కడే ఉన్న ఇనుప స్తంభాన్ని పట్టుకున్నాడు. అప్పటికే తెగిన విద్యుత్ వైరు ఆ స్తంభానికి తాకి ఉండటంతో.. విద్యుత్ షాక్​కు గురయ్యాడు. బందువులు సాలూరు పీహెచ్​సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్​కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దినకర్ తెలిపారు.

ఇవీ చూడండి...

సాలూరు పుర పాలక సంఘం చైర్ పర్సన్​గా పువ్వల ఈశ్వరమ్మ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.