విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం పెదతడివాడ, బొబ్బిలి పట్టణ పరిధిలో పారిశ్రామికవాడలో ఇసుక విక్రయానికి ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రంలో 13 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే యార్డులో ఇసుకను అధికారులు నిల్వ చేస్తున్నారు. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. లాక్డౌన్లో అమ్మకాలు నిలిపివేయటంతో యార్డులో ఇసుక లభ్యత ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకోగానే ఇంటికి ఇసుక తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టన్ను 1225 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారులు ఎట్టకేలకు ఇసుక విక్రయాలు ప్రారంభించడంతో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో రెండు చోట్ల ఏర్పాటుచేసిన కేంద్రాల నుంచి కావలసిన వారికి ఇసుకను నేరుగా ఇంటికి అందజేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇది చదవండి వైరస్ పట్ల ప్రజల్లో భయం, ఆందోళన తొలగించాలి: సీఎం జగన్