కరోనా వైరస్ను నియంత్రించేందుకు తప్పనిసరిగా మాస్కును ధరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఎస్పీ పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. కరోనా కేసుల సంఖ్య జిల్లాలో పెరుగుతున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కట్టడికి ప్రధానంగా 3 సూత్రాలు పాటించాలని..ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజరుతో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి. కరోనా సోకినా.. మారని దొంగలు