ETV Bharat / state

తిరుపతి నుంచి రామతీర్థానికి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు - rama theertham idol demolish updates latest news

తిరుపతిలోని తితిదే శిల్ప తయారీ కేంద్రం నుంచి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు రామతీర్థం తరలించారు. అధికారులు విగ్రహాలకు పూజలు నిర్వహించి రామతీర్థానికి తీసుకెళ్లారు.

sitha rama laxmana idol send to ramatheertham from tirupathi
తిరుపతి నుంచి రామతీర్థానికి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు
author img

By

Published : Jan 22, 2021, 7:52 PM IST

Updated : Jan 22, 2021, 8:12 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాములవారి విగ్రహం స్థానంలో ప్రతిష్టించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాలను తిరుపతి నుంచి రామతీర్థం తరలించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం... పోలీసుల భద్రత మధ్య అధికారులు విగ్రహాలను తరలించారు.

తిరుపతి నుంచి రామతీర్థానికి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు

విగ్రహాల తయారీకి దేవాదాయశాఖ నుంచి తితిదేకు ఈనెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి, ముగ్గురు స్థపతులు విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగుల ఎత్తు, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులుగా తయారు చేశారు. స్థపతులు తొలుత 15 రోజుల వ్యవధిలో విగ్రహాలు ఇస్తామని చెప్పినా.. కేవలం 10 రోజుల్లోనే పూర్తిచేశారు.

ఇదీ చదవండి: తిరుపతిలో రామతీర్థం విగ్రహం తయారీ

Last Updated : Jan 22, 2021, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.