విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు, ఉప కలెక్టర్ విదేహ్ ఖారే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ స్థల పరిశీలన చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పశువైద్య కేంద్రం, ఆర్ అండ్ బీ జలవనరుల శాఖ కార్యాలయాల్లో అదనంగా ఉన్న స్థల సేకరణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. గిరిజన ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇందుకోసం రూ .25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. స్థలం త్వరగా సేకరించి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి. 'నాకు న్యాయం చేయండి.. మరొకరికి ఇలా జరక్కుండా చూడండి'