మేనేజ్మెంట్ కోటాలో విద్యనభ్యసించిన డీఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్ధులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2018-20 డీఎడ్ విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించాలని నినాదాలు చేశారు. కౌన్సిలింగ్ ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులకు.. డీఎడ్ పరీక్షలు ఈ నెల 28 నుంచి జరగనున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలనని డీవైఎఫ్ఐ నాయకులు మణికంఠ అన్నారు. వారికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని కఠినతరం చేస్తామని హెచ్చరించారు.
వారి పరిస్థితి ఆయోమం...
కౌన్సెలింగ్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం వల్ల మేనేజ్మెంట్ విద్యార్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి, కష్టపడి చదివిన మా ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. మా భవిష్యత్తుతో ఆటలు ఆడోద్దని కోరారు.
జీవో 30 సవరణతో కష్టాలు...
ఈ బ్యాచ్‌కు 2019 జులైలోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నూతన ప్రభుత్వంలో జీవో నంబరు 30ను తొలగించడం వల్ల పరీక్షల నిర్వ హించలేమని అధికారులు చెబుతున్నారని డీవైఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ