ETV Bharat / state

పింఛన్ల పంపిణీలో అక్రమాలు.. విధుల నుంచి సచివాలయ ఉద్యోగుల తొలగింపు - విజయనగరంలో అక్రమాలకు పాల్పడిన సచివాలయ ఉద్యోగులు అరెస్టు తాజా వార్తలు

విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి సచివాలయంలో.. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ సహా... ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్ కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు.

Secretariat employees arrested for irregularities in distribution of pensions
పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన సచివాలయ ఉద్యోగులు అరెస్టు
author img

By

Published : Jul 14, 2021, 11:32 AM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లిలో వైఎస్సార్‌ పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో.. సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ రేగాన శ్రీరామ్‌ సహా ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన డివిజినల్‌ అభివృద్ధి అధికారి రామచంద్రరావు ఇచ్చిన నివేదిక ఆధారంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా.. క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ రేగాన శ్రీరామ్‌, వాలంటీర్లు దాసరి రాంబాబు, గొట్టాపు శంకర్రావు, ఎల్‌.శ్రీనివాసరావు, ఎస్‌.హేమలత కలిసి రూ.1.47 లక్షలు మాయం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దివ్యాంగుడు నల్లబోలు రామారావు 2020 ఆగస్టులో మృతి చెందగా అతని పేరుతో తొమ్మిది నెలల పింఛను రూ.45 వేలు, బుద్దరాజు రమణమ్మ 2020 సెప్టెంబరులో చనిపోగా ఆమె పేరిట 9 నెలల మొత్తం రూ.20,250 దోచేశారు.

కొన్న లక్ష్ము... 2021 ఏప్రిల్‌లో మరణించగా ఆ తర్వాత మూడు నెలల పాటు రూ.6,750, తామాడ తవుడమ్మ, బొత్స తాత 2020 జులైలో మరణించగా.. వారికి మంజూరైన పది నెలల మొత్తం రూ.44,500 చొప్పున డ్రా చేశారు. కలిశెట్టి సూరమ్మ, పొట్నూరు భాగయ్య 2021 మార్చిలో మరణించిన తర్వాత వారి పేరిట మూడు నెలల మొత్తం రూ.13,500 నొక్కేశారు. పెరుమాలి తాతయ్య 2021 జనవరిలో మరణించగా ఐదు నెలల పింఛను రూ.11.250, గొట్టాపు సోములు 2021 ఏప్రిల్‌లో చనిపోగా రెండు నెలల మొత్తం రూ.6 వేలు డ్రా చేశారు.

ఇదీ చదవండి:

నది సంద్రంలో నిర్వాసితుల విలవిల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.