ETV Bharat / state

రైలు ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు

రైళ్లలో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

robberies in train west benagal gang
రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు
author img

By

Published : Feb 13, 2020, 2:24 PM IST

రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్టు

ప్రయాణికుల నుంచి తరచుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు విశాఖపట్నం పరిధిలో సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించారు. సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లలో నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విజయనగరంలోని ఓ హోటల్​లో ఉన్న 8 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పశ్చిమ బెంగాల్​కు చెందిన ముఠాగా గుర్తించారు. 7 లక్షల రూపాయలు విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకున్న సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

ఇవీ చూడండి:

పేదరికంలో ఉన్నా.. నిజాయితీ చాటుకున్న దంపతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.