ఇటీవల కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దేరువాడ గ్రామ సమీపంలో రహదారికి అడ్డంగా కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై ఈటీవీ భారత్లో ప్రచురించిన కథనానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పందించారు. బండరాళ్లను తొలిగించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అధికారులు రోడ్డుపై ఉన్న పెద్ద బండరాళ్లను బాంబుల ద్వారా పేల్చి జేసీబీతో తొలగించారు. నాలుగు పంచాయతీలు, 60కి పైగా గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ ఒక్క మార్గమే దిక్కు. రాళ్లను తొలిగించటంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి