విజయనగరం జిల్లాలో కరోనా టీకా పంపిణీకి.. ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొదటి విడతలో 17వేల 900మంది పేర్లు నమోదు చేసుకోగా.. 21వేల 500 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. టీకా పంపిణీ కోసం అధికారులు..జిల్లాలో 15 కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం పరిధిలో విజయనగరం ఘోషా ఆసుపత్రితో పాటు, రాజీవ్‌నగర్ కాలనీ, పూల్‌బాగ్, జగన్నాథపురంలోని పట్టణ ఆరోగ్యకేంద్రాలను సిద్ధం చేశారు. బాడంగి, చీపురుపల్లి, భద్రగిరి, కురుపాం, భోగాపురం, ఎస్.కోట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీసు భద్రత మధ్య జిల్లా కేంద్రం నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్‌ను తరలించారు.
ఇదీ చూడండి: