విజయనగరం జిల్లాలో ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేసే వాహనాలను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. నగరంలోని పోలీసు శిక్షణా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో... ఆయనతో పాటు కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాకు మంజూరు చేసిన 458 వాహనాలను జెండా ఊపి ఆరంభించారు. లబ్ధిదారులు సరుకులు తీసుకువెళ్లేందుకు కేటాయించిన జ్యూట్ సంచులను ఆవిష్కరించారు. అనంతరం వాహనాలు ప్రదర్శనగా ఆయా మండల కేంద్రాలకు బయలుదేరాయి.
ఇదీ చదవండి:
లక్ష్యం.. ధర్మ పరిరక్షణ.. ఉపఎన్నికల ప్రచారానికి సిద్ధమైన తెలుగుదేశం