విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకూ భానుడు భగ్గుమంటున్నాడు. సాయంకాలానికి మబ్బులు కమ్ముకోవడం నగర వాసుల్లో వర్షాలపై ఆశలు పెంచుతోంది. ఈదురు గాలులు వీస్తుంటే వర్షం పడొచ్చని ఆశగా ఎదురుచూసిన జనాలకు... చివరికి నిరాశే ఎదురవుతోంది. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలుగా.. రాత్రికి కనిష్టం 28 డిగ్రీలుగా నమోదవుతోంది. మరోవైపు సాయంత్రపు వేళ వీచే గాలులకు మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది.
ఇదీ చదవండీ :