ఖైదీలు ఆరోగ్యం దృష్ట్యా వైరస్ బారిన పడకుండా జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సబ్‌జైలును ఆయన సందర్శించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నరసరావుపేట జైళ్లకు కొత్తగా వచ్చే ఖైదీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన ఖైదీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జైలుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వాళ్లలో కొవిడ్ భయం తొలగించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: