తెదేపా అధినేత చంద్రబాబును.. రామతీర్థం కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే కాన్వాయ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ నుంచి చంద్రబాబు దిగి స్థానికులతో మాట్లాడారు. తమకు ఇళ్లు ఇవ్వలేదని విచారించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తమ వద్దే ఉన్నాయని చెప్పారు.
వాటిలో చేరేందుకు నానా తిప్పలు పెడుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రకరకాల కారణాలతో టిడ్కో ఇళ్లు ఇవ్వడం జాప్యం చేస్తున్నారని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పందించిన చంద్రబాబు.. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షనేత అంటేనే లెక్కలేదని.. సామాన్య ప్రజలంటే ఏమి గౌరవం ఉంటుందని అన్నారు. కొద్ది సేపటికి తర్వాత... మరో మార్గంలో చంద్రబాబు కాన్వాయ్ మళ్లించారు. కూడలి వద్ద వైకాపా నేత విజయసాయిరెడ్డి ఉన్నందున మరో మార్గంలో చంద్రబాబు కాన్వాయ్ ను పంపించారు.
ఇదీ చదవండి:
రామతీర్థం వద్ద ఉద్రిక్తత.. విజయసాయిరెడ్డి వాహనంపై రాయి విసిరిన నిరసనకారులు