ETV Bharat / state

రామతీర్థ ధర్మయాత్రపై పోలీసుల ఆంక్షలు...కన్నా గృహ నిర్బంధం

కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనను ఖండిస్తూ 'భాజపా- జనసేన' నేడు రామతీర్థ ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. భాజపా నేతలను అక్కడికి వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణను గృహ నిర్బంధం చేశారు.

kanna lakshminarayana
kanna lakshminarayana
author img

By

Published : Jan 5, 2021, 12:30 AM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహ ధ్వంసం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ 'భాజపా- జనసేన' సంయుక్తంగా రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టాయి. దీనికి పోలీసు శాఖ నుంచి అనుమతులు సైతం పొందారు. అయితే జిల్లాలో శాంతిభద్రతలు, కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా రామతీర్థంలోని ఆలయ పరిసరాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఆంక్షలు విధించినా ధర్మయాత్ర చేపట్టి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొంది.

వైకాపా సర్కార్ విఫలం

చలో రామతీర్థం కార్యక్రమానికి బయలుదేరిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని ఆయన నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్న పోలీసులు.. గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యపై కన్నా మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రామతీర్థం బయలుదేరుతున్న తనని పోలీసులు గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం: వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.