విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురం పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్దుడిని భోగాపురం పీసీ శ్రీనివాసరావు ఎత్తుకొని, పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చిన ఓ చంటిబిడ్డతో వచ్చిన బాలింతను గమనించిన విజయనగరం రెండో పట్టణ పోలీస్స్టేషన్ మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి... ఆ బాబును ఎత్తుకొని ఆడించారు. ఇలా పలువురికి సహాయం చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చదవండి: