విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల త్యాగాలను, దేశభక్తిని ప్రతిబింబించే సాస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి.. జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మావోయిస్టులు, ప్రత్యేక దళాల మధ్య జరిగే కాల్పుల డెమో చూపించారు. పలు డైలాగ్లు, మిమిక్రీ, పాటలు, శాస్త్రీయ నృత్యాలు, నాటకాలను ప్రదర్శించారు. వీక్షకులను ఈ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి