ETV Bharat / state

విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంకు పిడుగు హెచ్చరికలు - నిర్వహణ

విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

విజయనగరం, విశాఖలకు పిడుగు హెచ్చరిక
author img

By

Published : Jun 3, 2019, 10:52 AM IST

విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట.. విశాఖ జిల్లాలోని ముంచింగిపుట్టు, డుంబ్రిగుడ, అరకువాలీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. మూడు జిల్లాల్లోని అన్ని మండలాల్లో పిడుగులు, వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. కాసేపట్లో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. విజయవాడ పరిసరాల్లో పెనుగాలులతో వర్షం, పిడుగులు పడతాయని తెలిపింది.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_02_annavaram_night_food_trust_board_p_v_raju_av_c4_SD_(1) తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రాత్రి వేళల్లో కొండపై బస చేసే భక్తులకు ఇకపై అల్పాహారం కూడా నిత్యాన్నదానం లో అందించేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ రోహిత్ అధ్యక్షతన ప్రస్తుత ధర్మకర్తల మండలి చివరి సమావేశం జరిగింది. భక్తలు రాత్రి సమయంలో ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారని భావించి ముందుగా ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటల నుంచి అన్నదాన భవనం లో నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా కరాచీ ఉప్మా, టమాటా బాత్, మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సాంప్రదాయ వస్త్ర నిబంధన దశల వారిగా అమలు చేయాలని, ముందు ఆర్జిత సేవలు, నిత్య కల్యాణం, వ్రతాలకు అమలు చేయాలని, తరవాత దర్శనాలకు దశల వారిగా అమలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లు, ప్రాధమిక వైద్య సేవలు, అన్నదాన భవన నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అయితే డోనర్ కాటేజీ లను దాతలకు కేటాయింపులు, రుసుము వసూలు, నిర్వహణ పై జరిగిన చర్చ లో చైర్మన్, సభ్యుడు ఎం. ఎస్. రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.