ETV Bharat / state

స్నానానికి దిగిన వ్యక్తి గల్లంతు... 2 రోజుల అనంతరం 'వెలికితీత' - person died in champavati river in vijayangaram district

విజయనగరం జిల్లా ఆనందపురం వద్ద చంపావతి నదిలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా... మృతదేహం మంగళవారం లభ్యమైంది.

person missing in champavati river dead body found
చంపావతి నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : Oct 27, 2020, 8:11 PM IST

విజయనగరం జిల్లా జామి మండలం ఆలమండ గ్రామానికి చెందిన మైలపల్లి సూరిబాబు (44)... సోమవారం చంపావతి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. ఆనందపురం బండి నూకాలమ్మ వారాల పండక్కి వచ్చిన సూరిబాబు... స్నేహితులతో కలిసి సరదాగా చంపావతి నదిలోకి స్నానానికి దిగాడు.

తారకరామా బ్యారేజి గేట్ల నుంచి నీటి వరద ప్రవాహం ఉద్ధృతంగా రావడం వల్ల ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం గాలింపు చేపట్టినా అతని ఆచూకీ దొరకలేదు. చివరికి ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. గుర్ల ఎస్సై లీలావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.