'జగనన్న వసతి దీవెన' పథకాన్ని విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయోధ్య మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు విద్యార్థులను పోలీసులు అనుమతించలేదు. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వారిపై అత్యుత్సాహం ప్రదర్శించి బయటకు నెట్టే ప్రయత్నం కూడా చేశారు. విద్యార్థులతో పాటు చాలా మంది మహిళలు, వృద్ధులు ప్రాంగణం బయటే ఉండిపోయారు.
పోలీసుల అత్యుత్సాహం.. సీఎం సభ వద్ద ప్రజల ఇబ్బందులు
విజయనగరంలో నిర్వహించిన సీఎం బహిరంగ సభ వద్ద ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సభ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల చాలా మంది బయటే ఉండిపోయారు. పోలీసుల అత్యుత్సాహంతో విద్యార్థులు సైతం సభా ప్రాంగణంలోకి వెళ్లలేకపోయారు.

ఇదీ చదవండి: