కరోనా కట్టడిలో భాగంగా దాదాపు రెండు నెలలు నిలిచిపోయిన రైళ్లు తాజాగా పట్టాలెక్కాయి. విజయగరం జిల్లాకు చేరుకున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించి అనుమానం ఉంటే క్వారంటైన్‌కు పంపుతున్నారు. ముఖ్యంగా రాజస్ధాన్, అహ్మాదాబాద్, గుజరాత్, ముంబాయి, మధ్యప్రదేశ్, దిల్లీల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా క్వారంటైన్ కు పంపాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. విజయనగరం జంక్షన్‌కు ఫలక్ నామా ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అందులో 43 మంది రాగా, ముగ్గురు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. మిగతా 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని 14 రోజులు క్వారంటైన్ కు తరలించాల్సిందిగా అధికారులు స్పష్టం చేసారు.
ఇదిచదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి