విజయనగరం జిల్లా కురుపాం మూలిగూడ కూడలి, కురుపాం పోలీస్ స్టేషన్లో పార్వతీపురం డీఎస్పీ సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. చెక్ పోస్ట్ సిబ్బందికి సూచనలు చేశారు. ఒడిశా నుంచి వచ్చే వాహనాలు తనిఖీ చేయాలని చెప్పారు.
కర్ఫ్యూ సమయంలో ఈ-పాస్ లేని వాహనాలు రాష్ట్రంలోకి అనుమతించవద్దని ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటించని వాహనచోదకులకు చలానాలు వేయాలన్నారు. అనంతరం చెక్పోస్ట్ వద్ద పత్రాలను పరిశీలించారు.
ఇదీ చదవండి:
Cocktail antibodies: కాక్‌టెయిల్ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు