గిరిజనుల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 14నెలల పాలనలో గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. పార్వతీపురంలోని ఏయూ క్యాంపస్ వద్ద రూ.కోటి 35 లక్షలతో నిర్మించిన గిరిజన సంక్షేమ భవనాన్ని...ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
తెదేపా పాలనలో నాలుగున్నరేళ్లు గిరిజన సంక్షేమశాఖను ఆ వర్గాలకు కేటాయించలేదని...కానీ వైకాపా ప్రభుత్వం తనని మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని పుష్ప శ్రీవాణి గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
ఇదీ చదవండి