ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పటికి వేతనాలు చెల్లించలేదన్నారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: 'పేద విద్యార్థుల సంక్షేమం కోసం టీఎన్ఎస్ఎఫ్ పోరాడటం నేరమా?'