ETV Bharat / state

పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి: పీడీఎఫ్

author img

By

Published : Feb 25, 2023, 8:47 PM IST

Pension is the rights: పింఛను పొందడం విశ్రాంత ఉద్యోగుల హక్కు అని పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమాప్రభ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని రమాప్రభ డిమాండ్ చేశారు. ఉద్యోగులు చెల్లించే మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఉంచి తద్వారా వచ్చిన మార్పుల మేరకు పింఛను నిర్ణయించే విధానం విశ్రాంత ఉద్యోగుల పాలిట ఆశనిపాతమని రమాప్రభ అభివర్ణించారు.

pdf
విశ్రాంత ఉద్యోగులు

Pension is the rights : విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ప్రజా సంఘాల ఐక్యవేదిక పింఛనుదారుల సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమప్రభ మాట్లాడారు. నూతన పింఛన్ విధానం విశ్రాంత ఉద్యోగులకు ఎంత మొత్తం వస్తుందో, ఉద్యోగానంతర ఆర్థిక సౌకర్యాలు ఏ మేరకు వర్తిస్తాయో ఈ విధానంలో నిర్దిష్టంగా లేవని వెల్లడించారు. ఉద్యోగులు చెల్లించే మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఉంచి తద్వారా వచ్చిన మార్పుల మేరకు పింఛను నిర్ణయించే విధానం వల్ల విశ్రాంత ఉద్యోగులకు ఇబ్బందులు వస్తున్నాయని రమాప్రభ వెల్లడించారు.

ఈనెల 26న రాష్ట్రస్థాయి సదస్సు..: పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ విజయవాడలో ఈ నెల 26వ తేదీన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రెడ్డి వెంకట్రావు తెలిపారు. దేశవ్యాప్తంగా పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు విశ్రాంత ఉద్యోగులతో పాటు అనేక ప్రజాసంఘాలు సమాయత్తమవుతున్నాయన్నారు.

కేంద్ర వైఖరిలో మార్పు వచ్చేంత వరకు ఉద్యమం..: కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చేంతవరకు ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగిస్తామని ఆయన వివరించారు. సదస్సులో శాసనమండలి పూర్వ సభ్యుడు ఎంవీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి..: పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రజాసంఘాలు కొన్నేళ్లుగా ఉద్యమించాయి. పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేయడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పాత పింఛన్ విధానం అమలు ఆవశ్యకతను ప్రస్తావిస్తున్నారు.

ఫలితాల సాధనకు ఐక్య పోరాటం..: పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఉపాధ్యాయ సంఘాలు వివిధ రూపాలలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అపరిష్కృతంగా మిగిలిపోయిన పలు సమస్యలు నెరవేర్చాలని ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘాలు కలసి కట్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. అయినప్పటికీ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలంటూ మరోసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమాప్రభ డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉద్యోగుల ఆరోగ్య పథకం దుర్వినియోగం ..: వైఎస్సార్​సీపీ ప్రభుత్వ నిర్వాకంతో పింఛనుదార్లు ధీనావస్థలో కూరుకుపోయారని డాక్టర్ కోరుట్ల రమాప్రభ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయంగా అందాల్సిన పీఆర్సీ అమలులోనూ అన్యాయం చోటుచేసుకుందన్నారు. 2018 నుంచి రావాల్సిన డీలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద వసూలు చేస్తున్న మొత్తాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని ఆక్షేపించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు..: సకాలంలో పింఛన్ అందక విశ్రాంతి ఉద్యోగులు మానసిక సంఘర్షకకు లోనవుతున్నారు. పదవీ విరమణ తర్వాత నెలనెలా వచ్చే పింఛన్ తో నిశ్చింతగా గడపాల్సిన సమయంలో కొత్త పింఛన్ విధానం మూలంగా విశ్రాంత ఉద్యోగులు పలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రచారానికి, సలహాదారులకు కోట్లలో ఖర్చు చేస్తూ ఉద్యోగులను నిలక్ష్యానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చేందుకు మండలి వాణి వినిపించేందుకు తనకు ఓటు వేసి గెలిపించాలని పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమాప్రభ ఓటర్లకు మనవి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.