విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి ఆనుకుని ఉన్న డెంకాడ కాలువ ఆయకట్టు... నాణ్యత లోపంతో రైతులు పడ్డ ఇబ్బందులపై ఈనాడు, ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఆయకట్టు నిర్మాణాన్ని ఇరిగేషన్ డీఈ గోవిందరావు, ఏఈ కనకమహాలక్ష్మి కాలువను పరిశీలించారు. రహదారి విస్తరణ పనులు చేపట్టినప్పుడు...ఆయకట్టు నిర్మాణాన్ని పూర్తిగా లోతట్టుగా కట్టడంతో పాటు గట్టు నిర్మాణాల్లో లోపాలు ఉండడాన్ని గమనించారు. సర్వే చేపట్టి రెండు, మూడు రోజుల్లో రైతుల ఇబ్బందులను తీర్చి... ఆయకట్టు కింద ఉన్న 56 ఎకరాలకు సాగునీరు వెళ్లే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!