విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆండ్ర రిజర్వాయర్ను చూసేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. రిజర్వాయర్ సమీపంలోని గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారంతా రిజర్వాయర్ చూడటానికి వెళ్లారు. అలకిడి కారణంగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. గాయపడిన వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: వివాహిత మృతి.. నలుగురిపై కేసు