ETV Bharat / state

'షెడ్యూల్డ్​ ఏరియాలో ఏర్పాటు చేసిన మొదటి న్యాయస్థానం ఇదే..' - న్యాయస్థాన భవన సముదాయం ప్రారంభోత్సవం

విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనం, మేజిస్ట్రేట్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనాది రమేశ్ ప్రారంభించారు.షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెుదటి న్యాయస్థానం ఇదేనని జస్టిస్ రమేశ్ అన్నారు.

'షెడ్యూల్డ్​ ఏరియాలో ఏర్పాటు చేసిన మెుదటి న్యాయస్థానం ఇదే..'

author img

By

Published : Apr 3, 2022, 4:50 PM IST

హైకోర్టు పరిధిలో ఉన్న ప్రతి షెడ్యూల్డ్ ఏరియాలోనూ ఓ కోర్టు ఉండాలనే సంకల్పంతో 2006లో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనాది రమేశ్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలో రూ.3.69 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనం, మేజిస్ట్రేట్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొదటి న్యాయస్థానం ఇదేనని జస్టిస్ రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి రాజగోపాలరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసరావు, కురుపాం న్యాయస్థానం న్యాయమూర్తి సౌజన్య, సబ్ కలెక్టర్ భావన, జిల్లాలో ఉన్న పలు కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అర్ధరాత్రి పబ్​లో నిహారిక.. వీడియో రిలీజ్ చేసిన నాగబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.