MRO fire on SI : ‘నీకు పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకో.. ఎందుకీ ఉద్యోగం’ అంటూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల తహసీల్దారు కృష్ణమూర్తి అదే ప్రాంతానికి చెందిన మహిళా ఎస్‌ఐ జయంతిని అసభ్యకర పదజాలంతో దూషించారు. గోవిందపురం గ్రామస్థులు ప్రతిరోజూ లంకలపల్లి గుండా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తున్నారు. ఇసుకను పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారని, ఫలితంగా బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎడ్ల బండ్లను అడ్డుకోవడంతో ఇరు గ్రామస్థుల మధ్య వివాదం చెలరేగింది. ఎస్‌ఐ జయంతి, సిబ్బంది అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇరు గ్రామాల వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
గ్రామస్థులు ఎంతకీ ఎస్‌ఐ మాట వినకపోయేసరికి అప్పటికే అక్కడున్న తహసీల్దారు కృష్ణమూర్తి జోక్యం చేసుకున్నారు. గ్రామస్థులను పంపించి వేయడంలో ఎస్‌ఐ విఫలమయ్యారంటూ అసభ్యంగా మాట్లాడారు. మనస్తాపానికి గురైన ఆ ఎస్ఐ ఈ విషయాన్ని భోగాపురం ఎస్‌ఐ మహేష్‌తోపాటు .. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దూషణ గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు.
ఇదీ చదవండి :
బొబ్బిలి పారిశ్రామికవాడలో ఉద్రిక్తత.. పోలీసులపై ఇసుక చల్లిన మహిళలు