ETV Bharat / state

ఆలస్యంగా రైళ్లు.. పట్టాలపై ప్రయాణికుల ఆందోళన - రైళ్ల రాకపోకలు

నిత్యం వేల మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విశాఖకు రైల్లో ప్రయాణిస్తుంటారు. వీళ్లకు రైళ్ల ఆలస్యం ప్రధాన సమస్యగా మారింది. ఈ ఆలస్యంతో విసిగిపోయిన ఉద్యోగులు, విద్యార్థులు కోరుకొండ రైల్వేస్టేషన్​లో ఆందోళనకు దిగారు. గంటసేపు పలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.

రైళ్ల ఆలస్యంతో విసిగిన ప్రయాణికులు...పట్టాలపై ఆందోళన
author img

By

Published : May 25, 2019, 2:06 PM IST

రైళ్ల ఆలస్యంతో విసిగిన ప్రయాణికులు...పట్టాలపై ఆందోళన
పాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని విజయనగరం జిల్లా కోరుకొండ రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆలస్యానికి నిరసన తెలుపుతూ పట్టాలపైకి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు విశాఖ-రాయఘఢ్, పలాస-విశాఖ పాసింజర్ రైళ్లను నిలిపివేశారు. సుమారు గంట పాటు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ రెండు పాసింజర్ రైళ్లు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటం వలన ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోయారు.

రైళ్ల ఆలస్యంపై రైల్వే అధికారులకు పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేదని ప్రయాణికులు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి నిత్యం విశాఖకు వెళ్లి పనులు చేసుకునే వారు...రైళ్ల ఆలస్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. తమ అసౌకర్యాన్ని రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదన్న ప్రయాణికులు... నిరసనకు దిగారు.

ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని సకాలంలో పాసింజర్ రైళ్లను నడపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయినా రైల్వే అధికారులు ఎవరూ సంఘటన స్థలానికి రాకపోవడం విశేషం. ఇతర ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నిరసనకారులు గంట తర్వాత ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి : తప్పు చేసుంటే క్షమించండి: బోడె ప్రసాద్

Mumbai, May 25 (ANI): Much awaited 'PM Narendra Modi' has finally hit the theatres on Friday. The movie is getting phenomenal reviews from the moviegoers. Storyline, Vivek Oberoi's convincing acting and Prime Minister Narendra Modi's life story is garnering the most of the attention of the audience.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.