వేసవిలో ఏ విధమైన నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ప్రణాళికలు వేస్తున్నట్లు విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డు వద్ద ప్రధాన కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. గంటస్తంభం, మంచుకొండ వారి వీధి, చిన్న బజారు వంటి ప్రాంతాలలో మురుగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వాటిని కూడా దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు.
ఇదీ చూడండి కామధేనువు అనుకుంటే.. కళేబరమయ్యావా తల్లీ!