వీధిలోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ మహిళపై.. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చిందులేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కేఎల్పురంలో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే హాజరయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఓ మహిళ... తమ వీధిలోని మురుగుకాల్వ సమస్యను నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. కాలువ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని వాపోయారు. ఇంతలో కలుగచేసుకున్న ఎమ్మెల్యే కోలగట్ల.. సమస్యను ఇప్పుడు చెప్పటం ఏంటని మహిళపై మండిపడ్డారు. వాటర్ ట్యాంక్ కావాలా? వద్దా? అంటూ..ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: MLA Golla Baburao : నేను ఎప్పటికీ వైఎస్‌ఆర్, జగన్‌కు వీరవిధేయుడినే -గొల్ల బాబూరావు
MLA Kolagatla: మహిళపై ఎమ్మెల్యే కోలగట్ల ఆగ్రహం... కారణం అదే..! - విజయనగరం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరిన మహిళపై ఎమ్మెల్యే కోలగట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు హాజరైన ఆయనతో... ఓ మహిళ తన సమస్యను చెప్పుకోగా.. ఇప్పుడు చెప్పడం ఏంటని మహిళపై మండిపడ్డారు. వాటర్ ట్యాంక్ కావాలా? వద్దా? అంటూ చిరాకుపడ్డారు.